![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1057 లో.... రాజు, శేషు కలిసి డ్రింక్ చేస్తారు. ఆ తర్వాత అందరికి ఇందు భోజనం సిద్ధం చేస్తుంది. అందరిని పిలుస్తుంది. అప్పుడే రేఖ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇందుని సంతకం పెట్టమని చెప్తుంది. ఇందు ఆ పేపర్స్ చూస్తుంది. చదివితే వాళ్లకి డౌట్ వస్తుందేమోనని సైలెంట్ గా ఉంటుంది. అమ్మ ఇందు నువ్వు సీఈఓ కదా కనీసం ఎవరైనా డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు చదివినట్లు అయిన యాక్టింగ్ చెయ్యమని శేషు చెప్తాడు.
అదంతా ఏం అవసరం లేదు.. ముందు సంతకం పెట్టమని రేఖ అంటుంది. వద్దు ముందు చదువుతున్నట్లు ఉండడం ప్రాక్టీస్ చెయ్యాల్సిందేనని శేషు అంటాడు. దాంతో ఇందు పేపర్స్ లో ఉన్నది చదువుతుంది. ఇప్పుడు సంతకం పెడితే కంపెనీకి నష్టం వస్తుంది.. అంతేకాకుండా ప్రాబ్లమ్ లో పడుతుందని ఇందు అనుకుంటుంది. ఏంటమ్మా ఇందు ఏదో పేపర్లు తిప్పి అందులో తప్పు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు మొహం అలా పెట్టావని శేషు అడుగుతాడు. ఇప్పుడు ఇందులో ఉన్నది చెప్తే నాకు చదువు ఎలా వచ్చని అనుకుంటారని ఇందు సైలెంట్ గా ఉంటుంది. వేలిముద్ర పెట్టమని రేఖ అంటుంది. స్టాంప్ ప్యాడ్ లేదని ఇందు అంటుంది. నా దగ్గర ఉంది కదా అని భ్రమరాంబ ఇస్తుంది. ఇందు వేలిముద్ర వెయ్యబోతుంటే అప్పుడే రాజు ఎంట్రీ ఇస్తాడు. నా పర్మిషన్ లేకుండా ఇందు సంతకాలు చెయ్యడం ఏంటని అడుగుతాడు. నువ్వా సీఈఓ.. ఇందునా అని రేఖ అడుగుతుంది.. ఇప్పుడు భార్య సర్పంచ్ అయితే భర్తే కదా అన్నీ చూసుకునేది అందుకే ఇందు ఏం సంతకం పెట్టాలన్న ముందు నేను చూడాలని రాజు అంటాడు.
ఆ తర్వాత పేపర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి..... ఇంత మోసం చేస్తారా.. ఇప్పుడు ఇందు సంతకం చేస్తే ఎంత నష్టమని రాజు అంటాడు. ఇక మీదట ఏం చేయాలన్నా కూడా నన్ను అడగాలని రాజు అందరికి చెప్తాడు. రాజు వచ్చి సేవ్ చేసాడని అపర్ణ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో ఇందు వచ్చి రాజుని హగ్ చేసుకొని.. రాజు ఐ లవ్ యు అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |